Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఖాతాను ట్విట్టర్ పునరుద్ధరించింది. రాహుల్‌తో పాటు ట్విట్టర్ నిలిపేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన మరికొంత మంది ఇతర నేతలు ఖాతాలను అన్‌లాక్ చేసినట్టు ఆ పార్టీ నేతలు శనివారం పేర్కొన్నారు. ఢిల్లీలో లైంగికదాడికి గురైన ఒక బాలిక కుటుంబాన్ని పరామర్శించి, అనంతరం బాధిత కుటుంబసభ్యులతో కూడిన చిత్రాలను పోస్టు చేసినందకు ఆయన ఖాతాను ట్విట్టర్ గతవారం బ్లాక్ చేసిన విషయం విదితమే. దీనిపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఒక వీడియోను విడుదల చేసిన నేపథ్యంలో ఆయన ఖాతాను ట్విట్టర్ పునరుద్ధరించింది. కాగా ట్విటర్ ఇండియా అధిపతిగా ఉన్న మనీశ్ మహేశ్వరిని అమెరికాకు బదిలీ చేస్తూ ఆ సంస్థ శుక్రవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. అయితే బదిలీకి కారణాన్ని ట్విటర్ వెల్లడించలేదు. మనీష్ మహేశ్వరి 'రెవెన్యూ స్ట్రాటజీ అండ్ ఆపరేషన్ ' సీనియర్ డైరెక్టర్‌గా అమెరికా వెళ్లి, అక్కడ కొత్త పాత్రలో కొత్త మార్కెట్‌పై దృష్టి పెడతారని మాత్రమే పేర్కొంది.