Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టాన్‌స్వామి ఘటనపై న్యాయం కోరుతూ ప్రచారం
న్యూఢిల్లీ: దేశంలో ఆదివాసీల హక్కుల కోసం పోరాటం సాగించిన ఫాదర్ స్టాన్ స్వామీ.. జులై 5న జ్యుడిషియల్ కస్టడీలో మరణించారు. దీనిపై దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనిని సంస్థాగత హత్యగా ఆరోపించాయి. ప్రతిపక్షాలతో పాటు, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు సైతం ప్రభుత్వ తీరును ఖండించాయి. దేశంలోని ప్రధాన పార్టీలు రాష్ట్రపతికి సైతం లేఖరాశాయి. బీమా కోరేగావ్ అల్లర్ల ఆరోపణలతో అరెస్టయిన స్టాన్‌స్వామీ.. ఆ అల్లర్లకు తనకు ఎలాంటి సంబంధం లేదనీ, తన జీవితంలో ఆ ప్రాంతానికి కూడా వెళ్లలేదని పలుమార్లు పేర్కొన్నా.. తీవ్ర అనారోగ్యంతో ఉన్నా ఆయనకు బెయిల్ నిరాకరించబడింది. ఈ నేపథ్యంలో దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతున్నదనీ, దీని పరిరక్షణ కోసం భాగస్వాములు కావాలనీ సమాజిక, హక్కుల కార్యకర్తలు ప్రచారం కార్యక్రమం నిర్వహిస్తూ.. ఇందులో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. స్టాన్స్వామీపై ఆరోపణలు, నిజనిజాలు వెలికితీయాలని పేర్కొంటున్నారు.