Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన ఐటీ నిబంధనలపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనావళిలో పలు అంశాలు వివాదాస్పదమవుతున్నాయి. దీనిపై తాజాగా బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నూతన ఐటీ చట్టంలోని రెండు నిబంధనలు వాక్ స్వాతంత్య్రాన్ని కాలరాస్తున్నాయని చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ నిబంధనల అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. నూతన ఐటీ నిబంధనావళిలో రూల్9(1), 9(3)...ప్రకారం డిజిటల్ న్యూస్ మీడియా, పబ్లిషర్లు 'కోడ్ ఆఫ్ ఎథిక్స్'కు కట్టుబడి ఉండాలి. దీనిని సవాల్ చేస్తూ ఆంగ్ల న్యూస్ వెబ్‌పోర్టల్స్ 'ద లీఫ్లెట్', జర్నలిస్టు నిఖిల్ వాగ్లే బాంబే హైకోర్టును ఆశ్రయించారు. నూతన ఐటీ నిబంధనావళి నుంచి పిటిషన్‌దారులకు ఉపశమనం కల్పిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం వాక్ స్వాతంత్య్రాన్ని ఉల్లంఘించే విధంగా నిబంధనావళి ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. నూతన ఐటీ నిబంధనావళిలో రూల్-9 ప్రమాదకరంగా ఉందని, కాబట్టి వాటిపై స్టే విధిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. కేంద్రం అమల్లోకి తెచ్చిన నూతన ఐటీ నిబంధనావళిలో పలు సెక్షన్లను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలువురు సామాజికవేత్తలు, మీడియా ప్రముఖులు న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తున్నారు.