Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహాకల్ ఆలయంలో వివాదం
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని ప్రపంచ ప్రసిద్ధిపొందిన మహాకల్ ఆలయంలో శుక్రవారం ఒక వివాదం చెలరేగింది. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజరువర్గియతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారన్న కారణంతో తనకు ఆలయ గర్భగుడికి ప్రవేశం నిరాకరించారని సీనియర్ పూజారి అజరు గురు ఆరోపించారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. కైలాస్, అతని కుమారుడితో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు అలయానికి వచ్చారు. గర్భగుడిలోని జ్మోతిర్లింగానికి పూజారులు హారతి ఇస్తున్న సమయంలో లోపల బిజెపి నేతలు ఉన్నారన్న కారణంతో తనను వెళ్లనివ్వలేదని అజరుగురు అన్నారు. రోజువారీగా ఉదయాన్నే ఈ హారతి కార్యక్రమాన్ని నిర్వహించే పూజారుల బృందంలో ఈయన కూడా ఒకరు. వివాదంపై అధికారులతో వాదిస్తున్న దానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. బిజెపి నేతలు ఉన్న సమయంలో తనను లోపలికి వెళ్లనివ్వనప్పుడు అధికారులు ఎంట్రీపాస్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని తాను ఉజ్జయిని జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని గట్టిగా అరవడం వీడియోలో ఉంది. బిజెపి నేతలు ఆలయంలో ఉన్నంతవరకు ఇతర భక్తులను నిలిపేశారు. మరోవైపు కైలాస్ విజరువర్గియ మాస్కు లేకుండా ఉండడం అదే వీడియోలో ఉంది.