Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిసాన్ మజ్దూర్ ఆజాది సంగ్రామ్ దివస్
- నేడు తివర్ణ జెండాలతో ర్యాలీలు
న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమ నిరసనను రైతులు మరింత ఉధృ తం చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా తిరంగా మార్చ్ నిర్వహించనున్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని 'కిసాన్ మజ్దూర్ ఆజాది సంగ్రామ్ దివస్' గా జరుపుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపు ఇచ్చింది. ట్రాక్టర్లు, కార్లు, ట్రాలీలు, మోటర్ సైకిల్స్, సైకిల్స్, ఆటోలు ఇతర వాహనాలకు జాతీయ జెండాలను కట్టి, మార్చ్‌లను నిర్వహించను న్నారు. దేశవ్యాప్తంగా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మార్చ్‌లు జరుగుతాయి. ఇప్పటికే సమీప ప్రాంతాల నుంచి ఢిల్లీ సరిహద్దులకు రైతులు చేరుకుంటున్నారు. ఢిల్లీ సరిహద్దులు సింఘూ, టిక్రీ, ఘాజీపూర్‌లో కూడా తిరంగ్ మార్చ్‌లు జరుగుతాయి. సింఘూలో ఎనిమిది కిలో మీటర్ల నుంచి ప్రధాన వేదిక వద్దకు కేఎంపీ ఎక్స్‌ప్రెస్ వే మీదుగా తిరంగా మార్చ్ చేరుకుంటుంది. అలాగే ఆందోళన ప్రాంతాల్లో మువ్వన్నెల జెండాలను ఎగురవేస్తారు. హర్యానాలోని జింద్ జిల్లాలో రైతులు ట్రాక్టర్ల కవాతు నిర్వహించనున్నారు. దీనికి మహిళా రైతులు తివర్ణ దుస్తులు ధరించి పెద్దఎత్తున పాల్గొననున్నారు. హర్యానాలోని ఉచనా కలాన్‌లో జింద్‌లో రైతులు 'ట్రాక్టర్ పరేడ్'కు ఒక రోజు ముందు శనివారం 'డ్రెస్ రిహార్సల్' నిర్వహించారు. దీనికి మహిళా రైతులు నాయకత్వం వహిస్తున్నారు. రైతులు కవాతులో దాదాపు 5,000 వాహనాలు, 20,000 మంది రైతులు పాల్గొంటారని రైతు నేతలు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా ''కిసాన్ మజ్దూర్ ఆజాది సంగ్రామ్ దివస్'' గా జరుపుకోవాలని ఎస్కేఎం పిలుపు నిచ్చింది.