Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ, ఏపి ప్రభుత్వాలకు నోటీసులు
న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి శాస్త్రీయ చర్యలు తీసుకోకపోవడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ, ఏపిలో విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వాలనీ, గత ఏడాది డిసెంబర్లో ఉభయ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న శాస్త్రీయ చర్యలు తెలపక పోవడంపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి తీసుకున్న చర్యలపై ఆరు వారాల్లోగా సమగ్ర నివేదిక అందించాలని ఇరు రాష్ట్రాల అధికారులను ఆదేశించింది. విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి శాస్త్రీయంగా అధ్యయనం చేసి తీసుకున్న చర్యలపై నివేదిక అందించకపోతే తమ ముందు హాజరు కావాల్సి వస్తుందని రెండు రాష్టాల ప్రధాన కార్యదర్శులను హెచ్చరించింది. తెలంగాణలో 2019 నేషనల్ క్రైం రికార్డుల ప్రకారం 426 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్హెచ్ఆర్సీ తెలిపింది. తెలంగాణలో ఒకే వారంలో 22 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపింది. విద్యార్థుల ఆత్మహత్యల
నివారణకు తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలు సరిపోవని పేర్కొంది. ఏపీలో ప్రభుత్వ క్రైం రికార్డుల ఆధారంగా 383 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్హెచ్ఆర్సీ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ఎన్హెచ్ఆర్సీకి సుప్రీం కోర్టు న్యాయవాది శ్రావణ్ కుమార్ ఫిర్యాదు చేశారు.