Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వాతంత్ర వేడుకలకు కట్టుదిట్టమైన భద్రత
- కంటైనర్లుతో గోడ, సీసీ కెమెరాలు
న్యూఢిల్లీ : 75వ స్వాతంత్య్ర వేడుకలకు ఎర్రకోట ముస్తాబైనది. నేడు(ఆదివారం) ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి, అనంతరం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ వేడుకల్లో ఒలింపిక్స్ క్రీడాకారులు కూడా పాల్గొనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నడూలేని విధంగా ఎర్రకోట ముఖ ద్వారం వద్ద.. షిప్పింగ్ కంటైనర్లతో గోడ మాదిరి పోలీసులు ఏర్పాటుచేశారు. 350 కెమెరాలతో పాటు రెండు ప్రత్యేక పోలీసు కంట్రోల్ రూమ్స్‌ను ఏర్పాటుచేశారు. ఎర్రకోట వద్ద ఐదు వేల మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. రైతుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దు వద్ద భద్రతను పెంచారు. ఢిల్లీ సరిహద్దుల వెంబడి చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. ప్రధాని మోడీకి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సహాయ మంత్రి అజరు భట్, రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజరు కుమార్ స్వాగతిస్తారు. డిఫెన్స్ సెక్రటరీ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీఓసీ), ఢిల్లీ ఏరియా, లెఫ్టినెంట్ జనరల్ విజరు కుమార్ మిశ్రా, ఏవీఎస్ఎమ్లను ప్రధానికి పరిచయం చేస్తారు. ఢిల్లీ పోలీస్ గార్డ్ సంయుక్తంగా ప్రధాన మంత్రికి గౌరవ వందనం సమర్పిస్తారు. ప్రధాన మంత్రి గార్డ్ ఆఫ్ హానర్ బృందంలో ఓ అధికారి, ఇండియన్ ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్, ఢిల్లీ పోలీసుల నుంచి 20 మంది చొప్పున ఉంటారు. అక్కడ నుంచి మోడీ ఎర్రకోట ప్రాకారాలకు చేరుకుంటారు. అక్కడ ఆయనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సహాయ మంత్రి అజరు భట్, రక్షణ సిబ్బంది చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్వాగతం పలుకుతారు. ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎంఎం నరవణే, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కెఎస్ భదౌరియా ఉంటారు. అక్కడ తివర్ణ పతాకాన్ని ప్రధాని మోడీ ఎగురవేస్తారు. అనంతరం 'రాష్ట్రీయ వందనం' స్వీకరిస్తారు. 16 మందితో కూడిన నేవీ బ్యాండ్ జాతీయ జెండాను ఎగురవేసే సమయంలో జాతీయ గీతంతో 'రాష్ట్రీయ వందనం' స్వీకరిస్తారు. జాతీయ జెండాను ప్రధాని ఎగురవేసే సమయంలో ఆర్మీ, నేవీ, వైమానిక దళం, ఢిల్లీ పోలీసుల నుంచి ఐదుగురు అధికారులు, 130 మందితో కూడిన జాతీయ జెండా గార్డు రాష్ట్రీయ వందనాన్ని సమర్పిస్తారు. ప్రధానమంత్రి జాతీయ జెండాను ఎగురవేసిన వెంటనే అమృత్ నిర్మాణంలో భారత వైమానిక దళానికి చెందిన రెండు హెలికాప్టర్ల ద్వారా పూలు జల్లుతారు. ప్రధాన మంత్రి ప్రసంగం తరువాత ఎన్సీసీ క్యాడెట్లు జాతీయ గీతాన్ని ఆలపిస్తారు.