Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటించాలి..
- ఫ్రంట్‌లైన్ వర్కర్ల కృషి వల్లే రెండోవేవ్ను ఎదుర్కోగలిగాం..
- జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
న్యూఢిల్లీ : కరోనాపై పోరాటం ఇంకా ముగిసిపోలేదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఆగస్టు 15 వేడుకల నేపథ్యంలో దేశ ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. కోవిడ్ రెండో వేవ్‌లో అనేకమంది ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న భారతీయులందరికీ రాష్ట్రపతి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. టోక్యో ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులు ప్రదర్శించిన ప్రతిభను కొనియాడారు. క్రీడల్లో చురుగ్గా పాల్గొనేలా అమ్మాయిల్ని ప్రోత్సహించినట్టు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల్ని ఎన్నటికీ మరచిపోలేమన్నారు. కరోనా ఉధృతిని తట్టుకొనేందుకు యుద్ధ చెప్పారు. టోక్యో ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులు ప్రదర్శించిన ప్రతిభను కొనియాడారు. క్రీడల్లో చురుగ్గా పాల్గొనేలా అమ్మాయిల్ని ప్రోత్సహించినట్టు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల్ని ఎన్నటికీ మరచిపోలేమన్నారు. కరోనా ఉధృతిని తట్టుకొనేందుకు యుద్ధ ప్రాతిపదికన వైద్య వసతులు కల్పించామని, ఫ్రంట్‌లైన్ వర్కర్ల కృషివల్లే కరోనా రెండో వేవ్‌పై పైచేయి సాధించగలిగామని అన్నారు. ''కరోనా కష్టకాలంలోనూ వ్యవసాయరంగంలో పురోగతి సాధించాం. కరోనా వల్ల వ్యాపారులు, వలసదారులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఆయా రంగాలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 50కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ జరిగింది. సులభతర జీవనం, వాణిజ్యంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది'' అని వివరించారు. ''కరోనా మహమ్మారి ఇంకా పోలేదు. ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటించాలి. ఈ మహమ్మారి నియంత్రణకు మన శాస్త్రవేత్తలు టీకాలను అభివృద్ధి చేయడంలో విజయవంతంకావడం వల్లే భారీ వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టగలిగాం. ఈ మహమ్మారి నుంచి రక్షించుకొనేందుకు వ్యాక్సిన్లే రక్షణ కవచంలా ఉపయోగ పడుతున్నాయి. ఇంకా మనమంతా మరిన్ని జాగ్రత్తలు పాటించాలనేదే కరోనా మనకు నేర్పినపాఠం. వైరస్ తీవ్రత తగ్గినప్పటికీ ఇంకా పోలేదు. కరోనా కట్టడి కోసం పనిచేసిన వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, కరోనా వారియర్లకు అభినందనలు. వారి సేవలే కరోనా రెండో వేవ్‌ను అదుపుచేయడంలో దోహదపడ్డాయి. కరోనా సంక్షోభ సమయంలో ఆరోగ్య కార్యకర్తల పాత్ర శ్లాఘనీయం. కరోనా సవాళ్లను అధిగమించాలన్న మనందరి సమిష్టి సంకల్పమే రెండో వేవ్ బలహీనపడేలా చేసింది'' అని రాష్ట్రపతి పేర్కొన్నారు.