Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లైంగికదాడి బాధితుల వాంగ్మూలం రికార్డులో నిబంధనలు పాటించాలంటూ ఆదేశాలు
లక్నో: లైంగికదాడి బాధితుల వాంగ్మూలాన్ని రికార్డు చేయడంలో చట్టపరమైన నిబంధనలు పాటించకపోవడంపై ఆధికార యంత్రాంగంపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.చట్టాల నిబంధనలకు అనుగు ణంగా పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయంలో మార్గదర్శకాలు జారీ చేయాలని న్యాయస్థానం సూచించింది. ''లైంగికదాడి అధిక కేసుల్లో బాధితుల వాంగ్మూలాన్ని రికార్డు చేయడంలో చట్టపరమైన నిబంధనలు పాటించల ేదు.బాధితురాలి వాంగ్మూలం రికార్డులో చాలా కేసుల్లో మహిళ ఆధికారులు ద్వారా రికార్డు చేయలేదు. అడియో, వీడియో వాంగ్మూలాను సైతం అధికారులు తీసుకోవడంలో మార్గదర్శకాలు అనుసరించడం లేదు'' అంటూ అలహాబాద్ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు నెలల్లోగా అన్ని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులకు నిబంధనలు పాటించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని ఉత్తరప్రదేశ్ డీజీపీ, హౌం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలను న్యాయస్థానం ఆదేశించింది. సీఆర్పీసీ సెక్షన్ 161 కింద బాధితుల రెండో స్టేట్మేంట్ రికార్డు చేసే పద్దతిని కూడా కోర్టు గుర్తుచేసింది. ప్రయాగ్ రాజ్ లైంగికదాడి నిందితుడి బెయిల్ దరఖాస్తును విచారించే సందర్భంలో న్యాయమూర్తి జస్టిస్ సంజరు కుమార్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేస్తూ.ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి బాధితురాలి రెండో వాంగ్మూలాన్ని రికార్డు చేయకపోవడంపై న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం సైతం వ్యక్త చేశారు.