Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : చాప కింద నీరులా వ్యాపిస్తున్న డెల్టా ప్లస్ వేరియంట్‌తో కోవిడ్ తగ్గుముఖం పడుతోందన్న ఆశలు అడియాసలౌతున్నాయి. మ్యుటేషన్లతో డెల్టా ప్లస్‌లో మరో మూడు ఉప రకాల వైరస్లు పుట్టుకొచ్చాయని నిపుణులు గుర్తించారు. ఎవై.1, ఎవై.2, ఎవై.3 పేర్లతో గుర్తించిన వీటిలో ఏవై.3 రకం మరింత ప్రమాదకరమైనదని కణ, అణు జీవశాస్త్ర కేంద్రం (సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ - సిసిఎంబి) మాజీ సంచాలకులు డాక్టర్ రాకేశ్‌మిశ్ర తెలిపారు. ఈ రకం వైరస్ కేసులు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 17 వేలకు పైగా నమోదయ్యాయి. భారత్‌లోనూ 261 వరకు కేసులున్నాయి. ఏప్రిల్ నుండి పలు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 65 కేసులు నమోదు కాగా ఐదుగురు మరణించారు.