Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఆగష్టు 15 వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర రాజధానుల్లో ఆయా ముఖ్యమంత్రులు జెండాను ఎగురవేశారు. జమ్ముకాశ్మీర్‌లో ఆంక్షల నడమ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి.
శంకరయ్యకు తగైసాల్ తమిజర్ తొలి పురస్కారం
చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్ వద్ద జరిగిన కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ జెండా ఎగురవేశారు. తమ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు అవార్డులు ప్రదానం చేశారు. అలాగే శనివారం సాయంత్రం ప్రముఖ కమ్యూనిస్టు, శత వసంతాల ఎన్ శంకరయ్యను ఆయన నివాసంలో స్టాలిన్ కలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెట్టిన తగైసాల్ తమిజర్ అవార్డును శంకరయ్యకు ముఖ్యమంత్రి అందచేశారు. ఈ అవార్డు కింద రూ.10 లక్షల చెక్‌ను బహుకరించారు. అయితే ఈ చెక్‌ను కోవిడ్ సహాయ కార్యక్రమాలకు శంకరయ్య విరాళంగా ఇచ్చివేశారు.
కేరళలో తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ జెండా ఎగురవేశారు.
ఈ సందర్భంగా విజయన్ మాట్లాడుతూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ సంస్థలు తమ ప్రాథమిక సూత్రాలకు అనుగుణంగా పనిచేసినప్పుడే దేశం నిజమైన స్వాతంత్య్రం సాధించగలదని అన్నారు.