Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాన్ని ముందడుగు వేయిస్తాం
- స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఏపీ సీఎం జగన్
అమరావతి: 'స్వాతంత్య్రం వచ్చిన 74 ఏండ్ల తరువాత ఈ రోజుకు కూడా కనిపిస్తున్న వ్యవస్థాగత లోపాలను సరిదిద్దుతాం. స్వాతంత్య్రానికి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, సమానత్వానికి ఆచరణలో అర్థం చెబుతాం. రాష్ట్రాన్ని ముందడుగు వేయిస్తాం' అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ తమ 26 నెలల పాలనలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనకబాటుకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర సామాజిక వర్గాల వారికీ మంచి భవిష్యత్తు ఉందన్న ఆత్మవిశ్వాసాన్ని నింపిందని చెప్పారు. 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా చూసిన ప్రజల సమస్యల పరిష్కారమే తమ పాలన లక్ష్యమని అన్నారు. ఈ 26 నెలల పాలనలో వ్యవసాయానికే సుమారు రూ.83 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల్లో వచ్చిన మార్పులను ప్రజలు గమనించాలన్నారు. గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి 500కు పైగా సేవలను అందిస్తున్నామన్నారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్ లోనే ఆవిర్భవించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత తమ పాలనలో 1.84 లక్షల మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని ఇందులో 1.3లక్షల మంది గ్రామ/వార్డు సచివాలయాల్లోనే ఉండగా మరో 58 వేల ఆర్టీసీలో ఉన్నారన్నారు.