Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘజిపూర్-సింఘు సరిహద్దులో
త్రివర్ణ పతాకానికి సెల్యూట్
- ఆ మూడు చట్టాలను ఉపసంహరించేదాకా ఇండ్లకు వెళ్లం: రైతుల ప్రతిజ్ఞ
న్యూఢిల్లీ: 75 వ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఢిల్లీ సరిహద్దులో రైతులు కిసాన్ తిరంగామార్చ్ నిర్వహించారు. నల్లచట్టాలను రద్దు చేయకుండా తాము ఇండ్లకు వెళ్లమని అన్నదాతలు ప్రతిజ్ఞ చేశారు. ఢిల్లీ సరిహద్దులోని ఘాజీపూర్, సింఘూ సరిహద్దులో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
బైక్-ట్రాక్టర్లపై మువ్వన్నెల జెండా
భారతీయ కిసాన్ యూనియన్ సీనియర్ నాయకుడు రాజ్వీర్ సింగ్ జడౌన్ యుధ్వీర్ సింగ్ నాయకత్వంలో రైతులు ఢిల్లీదీక్షాస్థలికి చేరుకున్నారు. ట్రాక్టర్, బైకులమీద త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ క్రాంతి గేట్ వద్దకు చేరుకున్నారు. జింద్‌లో మహిళా రైతులు త్రివర్ణ పతాకాలతోట్రాక్టర్ యాత్ర చేపట్టారు, చాదుని కురుక్షేత్రం నుంచి సింఘు సరిహద్దుకు చేరుకున్నారు.
అంతకు ముందు కురుక్షేత్రలో త్రివర్ణ యాత్రను ప్రారంభిస్తూ బీకేయూ రాష్ట్ర అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చాదుని మాట్లాడుతూ ఈ క్రాంతి చౌక్ వద్ద పోలీసులు రైతులపై లాఠీలు కాల్చారనీ, ఆ తర్వాత ఉద్యమం తీవ్రమైందని అన్నారు. ఇప్పుడు మళ్లీ ఈ క్రాంతి చౌక్ నుంచి ఢిల్లీకి వెళ్లి.. రైతులు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తారు. బీజేపీ చేపట్టిన త్రివర్ణ యాత్రలకు రైతుల త్రివర్ణ యాత్ర సమాధానం అని గుర్నామ్ సింగ్ చాధుని అన్నారు. రైతులు బలంతో తమ స్వరాన్ని పెంచాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
తొమ్మిదినెలలుగా ఉద్యమం కొనసాగుతున్నా..
రైతులు తమ హక్కుల కోసం గత తొమ్మిది నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో కూర్చున్నారని భారతీయ కిసాన్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్వీర్ సింగ్ జడౌన్ తెలిపారు. ఈ మూడు చట్టాల నుంచి రైతులు స్వేచ్ఛ పొందినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు అని తెలిపారు. నల్ల చట్టాలను రద్దు చేసినప్పుడు మాత్రమే దీక్షాస్థలి నుంచి కదులుతామని స్పష్టం చేశారు. మరోవైపు పోలీసు అప్రమత్తమయ్యారు. అడుగడుగునా బ్యారికేడ్లు..తనిఖీలతో భద్రతాఏర్పాట్లను పరిశీలించారు.