Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని ఆర్థిక, విదేశీ విధానాలను వ్యతిరేకిస్తున్నా..
- బహిరంగ చర్చకు సిద్దం : బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామీ
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ భారత దేశానికి రాజు కాదంటూ బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి ఆర్థిక, విదేశీ విధానాలకు తాను వ్యతి రేకమని చెప్పారు. మంత్రి పదవిని స్వామికి ఇవ్వకపో వడంతో ఆయన మోడీపై గుర్రుగా ఉన్నారని ట్విట్టర్ యూజర్ చేసిన వాదనకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. వాస్తవానికి తాను మరో కారణం వల్ల మోడీకి వ్యతిరేకమని పేర్కొన్నారు. 'మోడీ ఆర్థిక, విదేశాంగ విధానాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. బాధ్యత వహించే ఎవరితోనైనా దానిపై చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. భాగస్వామ్య ప్రజాస్వామ్యం గురించి మీరు విన్నారా? మోడీ భారతదేశ రాజు కాదు' అని సుబ్రమణ్య స్వామీ ట్వీట్ చేశారు.అలాగే, విదేశాంగ మంత్రిపై కూడా పలు వ్యాఖ్యలు చేశారు. విదేశాంగ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ తీసుకున్న పలు నిర్ణయాలతో అంతర్జాతీయంగా భారత ప్రతిష్ఠ దిగజారిందని విమర్శించారు. 'బ్యూరోక్రాట్ ద్వయం జైశంకర్, దోవల్ అంతర్జాతీయంగా భారతదేశాన్ని దిగజార్చినందుకు ఎప్పుడైనా జాతికి క్షమాపణలు చెబుతారా? తోటి స్థాయి రాజకీయ నాయకులను గాక, కొందరు రాజకీయ నేతలనే మోడీ విశ్వసించి వారికి స్వేచ్ఛ ఇచ్చారు. ఇప్పుడు మన పొరుగు దేశాలతో మనం గందరగోళంలో ఉన్నాం' అని మరో ట్వీట్ చేశారు. ఈ ప్రస్తుతం సుబ్రమణ్య స్వామీ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.