Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మారని పరిస్థితులు
- మోడీ పాలనలో అధ్వాన్నం
న్యూఢిల్లీ : దేశం స్వాతంత్య్రం సాధించి 75వ వసంతంలోకి దూసుకెళ్తున్నది. అయినప్ప టికీ దేశంలో మాత్రం ప్రజల కనీస అవసరాలు తీరడంలేదు. ఆకలి కేకలు తీవ్ర గందరగోళానికి గురి చేస్తు న్నాయి. ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించి ప్రజల అవసరాలు తీర్చాల్సిన మోడీ సర్కారు మాత్రం ఏమాత్రం పట్టించు కోవడం లేదు. దీంతో దేశంలోని పేదలు, మధ్య తరగతి ప్రజలు ఆకలితో అలమటిస్తు న్నారు. మోడీ పాలనలో అన్ని రంగాల్లో దేశం అభివృద్ధిలోకి దూస ుకెళ్తున్నదని కేంద్రం ప్రతి సందర్భంలో నూ మంత్రులు, అధికారులతో ప్రకటనలు చేపిస్తున్న ప్పటికీ వాస్త వానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తాజా అంచనాల ప్రకారం.. 2020- 21 ఏడాదికి దాదాపు 30.0 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని భారత్ సాధించింది.ఇది గోధుమ విషయంలో 10.9 కోట్ల టన్నులుగా, వరి విషయంలో 12.23 కోట్ల టన్నులగా ఉన్నది. ఇక పోషకాలు, ముతక తృణ ధాన్యాల విషయంలో ఇది 5.12 కోట్ల టన్నులుగా ఉన్నది. ఇక పప్పులు 2.57 కోట్లుగా రికార్డయ్యింది. అదనంగా, తొమ్మిది నూనె గింజల ఉత్పత్తి కూడా 3.6 కోట్ల టన్నుల రికార్డు స్థాయిని నమోదు చేయగా చెరకు ఉత్పత్తి 39.9 కోట్ల టన్నులగా అత్యుత్తమ స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది.అయితే, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. 75 ఏండ్ల క్రితం బ్రిటీషు పాలకుల పాలనలో దేశం ఏ పరిస్థితుల్లో ఉన్నదో, ప్రస్తుతం మోడీ పాలనలోనూ భారత్ ఆ విధంగానే ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు దేశీయ, అంతర్జాతీయంగా విడుదలైన పలు నివేదికలను వారు ఉటంకించారు. అలాగే దేశంలో ఆకలి, ఆకలితో బాధపడుతున్న అభాగ్యుల పరిస్థితులను సైతం వారు వెల్లడించారు.
గత కొన్నేండ్లుగా దేశంలో సహేతుకమైన వర్షపాతం లేని పరిస్థితులు, అనేక రాష్ట్రాలలో పెరుగుతున్న ఆకలి మరణాలు వంటి అంశాలను వారు ఉటంకించారు. పెరగుతున్న దిగుబడి కారణంగా వ్యవసాయ ఉత్పత్తి క్రమంగా దేశంలో పెరుగుతూ వచ్చిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.అందుబాటులో ఉన్న తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ప్రభుత్వ నిల్వలు 9.70 కోట్ల టన్నుల కంటే ఎక్కువగా ఉన్నాయి. కరోనా మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం.. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సాధారణ పంపినీకి అదనంగా 2.4 కోట్ల బియ్యం, 1.3 కోట్ల గోధుమలను పంపిణీ చేసింది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) 2020 అంచనా ప్రకారం.. భారత్లో కనీసం 18.9 కోట్ల మంది తీవ్రమైన ఆకలితో బాధపడుతున్నారు. జనాభాలో దాదాపు 14 శాతం మంది నిరంతరం ఆకలితో బాధపడుతున్నారు. ప్రపంచ ఆకలి సూచిక 2020 భారీ ఆకలితో బాధపడుతున్న 107 దేశాలలో భారత్ 94వ స్థానంలో ఉన్నది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2015-16 ప్రకారం.. ఏదేండ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో 59 శాతం రక్త హీనతతో ఉన్నారు. మొత్తం మహిళల్లో 53 శాతం మంది ఉన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2016-18 మధ్య నిర్వహించిన సమగ్ర జాతీయ పోషకాహార సర్వే (సీఎన్ఎన్ఎస్) ప్రకారం 35 శాతం పైగా పిల్లలు కుంగిపోయారు. అలాగే, 17 శాతం వృథా అయ్యారు. అలాగే వారు దీర్ఘకాలిక పోషకాహార లోపంతో బాధపడటం ఆందోళనకరమని చెప్పారు. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం చాలా ఆలోచించాల్సిన అవసరం ఉన్నదనీ, నిపుణలు, విశ్లేషకలు సలహాలు సూచనలు పాటించాల్సిన అవసరం ఉన్నదని వారు తెలిపారు.