Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోటి కోట్లతో గతిశక్తి
- త్వరలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళిక : 75 స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా త్వరలో రూ.100 లక్షల కోట్లతో 'గతిశక్తి జాతీయ మౌలిక సదుపాయాల ప్రణాళిక'ను ప్రారంభించనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ ప్రణాళిక సమగ్ర అభివృద్ధికి పునాదిగా ఉంటుందని, ఆర్థికాభివృద్ధికి మార్గం చూపుతుందని అన్నారు. ఆదివారం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగధనులను దేశం స్మరించుకుంటోందని అన్నారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌లోని మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించిన తర్వాత ఎర్రకోట వద్దకు చేరుకున్న మోడీ ముందుగా త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. జెండావిష్కరణ అనంతరం జాతినుద్దేశించి 90 నిమిషాల పాటు ప్రసంగించారు. గతిశక్తి ప్లాన్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, స్థానిక తయారీదారులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు ఈ పథకం దోహదపడుతుందన్నారు. భవిష్యత్తులో కొత్తగా ఆర్థిక మండళ్ల ఏర్పాటుకు అవకాశం లభిస్తుందన్నారు.
సరికొత్త ఆశలు, ఆకాంక్షలు, కలలతో రానున్న 25 సంవత్సరాలను అద్భుతమైన రోజులుగా చేసుకోవాలని మోడీ అన్నారు. స్వతంత్ర దినోత్సవ శతాబ్ది ఉత్సవాల నాటికి దేశాన్ని ప్రబలశక్తిగా చేసేందుకు సంకల్పం తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలందరి భాగస్వామ్యంతోనే సమృద్ధ భారత నిర్మాణం అవుతుందని చెప్పారు. ' సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్' అనే నినాదం తీసుకోవాలని అన్నారు. దేశంలో కరోనాపై పోరులో వైద్య సిబ్బంది, పోలీసులు, శాస్త్రవేత్తల పాత్ర అనిర్వచనీయమని మోడీ అన్నారు. ఇటీవల జరిగిన ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించారు. వారు దేశ యువతకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. దేశ సరిహద్దుల్లో నిరంతరం కాపలా కాస్తూ దేశానికి రక్షణగా ఉన్న జవాన్లకు సెల్యూట్ చేశారు. సంక్షేమ పథకాల అమలులో వివక్ష ఉండకూడదని ప్రతి పథకం వంద శాతం లబ్ధిదారులకు చేరేలా చేయాలని అన్నారు. రేషన్ దుకాణాల్లో పోషకాహార ధాన్యాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, పోషకాహారంతో పాటు వైద్యం కూడా అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. మండల స్థాయి వరకు పూర్తి వైద్య సౌకర్యాలు అందించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని మోడీ చెప్పారు. ఇకపై దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక స్కూల్స్‌లో బాలికలకు కూడా ప్రవేశం ఉంటుందని ప్రకటించారు. దేశ రైతుల్లో 80శాతం మంది రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమి కలిగివున్నారని, తమ ప్రభుత్వం చిన్న రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుం దని అన్నారు. ఇందులో భాగంగానే పిఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్నామని మోడీపేర్కొన్నారు. జమ్ముకాశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజనప్రక్రియ కొన సాగుతోందని, త్వరలో ఎన్నికలునిర్వహించన్నుట్లు మోడీతనప్రసంగంలో చెప్పా రు. జమ్ముకాశ్మీర్,లడఖ్ ప్రాంతాల అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని అన్నారు.