Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు నెలల బాలికపై లైంగికదాడి
లక్నో: మూడు నెలల బాలికపై ఓ మైనర్ బాలుడు లైంగికదాడికి పాల్పడిన అమానవీయ ఘటన బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకు ంది. వివరాల్లోకెళ్తే.. ఏటా జిల్లాలో మూడు నెలల బాలికపై 17 ఏండ్ల బాలుడు లైంగికదాడికి పాల్పడ్డాడని బాధిత కుటుంబం ఆరోపించింది. తన బిడ్డ ఏడుపు విన్న తల్లి... అక్కడి చేరగా.. బాలిక ప్రయివేటు భాగాల నుంచి రక్తస్రావం అవుతున్నట్టు గుర్తించింది. చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం మరో ఉన్నత కేంద్రానికి వైద్యులు రిఫర్ చేశారు. బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామనీ, దీనిపై విచారణ జరుగుతున్నది పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడనీ, అతన్ని పట్టుకోవడానికి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.