Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రముఖ మోడల్, పబ్ టెండర్ జెస్సికా లాల్ సోదరి సుబ్రినా లాల్ ఆదివారం సాయంత్రం అనారోగ్యం మరణించారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆమె సోదరుడు రంజిత్ తెలిపారు. ఇంటికే పరిమితం అయిన సుబ్రినా లాల్ ఆరోగ్యం శనివారం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించామనీ, ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని తెలిపారు. కాగా, మోడల్ జెస్సికా లాల్ 1999 ఏప్రిల్ 30న ఢిల్లీలోని ఒక పబ్లో కాల్చి చంపబడింది. మద్యం సర్వ్ చేయడానికి సమయం మించిపోవడంతో సర్వ్కు చేయడానికి నిరాకరించిన జెస్సికాలాల్ను.. రాజకీయ నేపథ్యం కలిగిన మనుశర్మ అలియాస్ సిద్ధార్థ్ వశిష్ట దారుణంగా తుపాకితో కాల్చి చంపాడు. తన సోదరికి న్యాయం కోసం సుబ్రినా లాల్ సుదీర్ఘకాలం పాటు పోరాటం సాగించారు. ఈ క్రమంలో 2006లో నేరం నిరూపితం కావడంతో న్యాయస్థానం శర్మకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. నేరస్థుడు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ.. కింది కోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించడంతో తిహార్ జైలుకు తరలించారు. అయితే, సత్త్పవర్తన పేరుతో ఎస్పార్బీ సిఫార్సులతో ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ ఆయన విడుదలకు ఒకే చెప్పడంతో గతేడాది విడుదల అయ్యాడు.