Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్చి నాటికి తగ్గనుంది : మంత్రి సీతారామన్
న్యూఢిల్లీ : దేశంలో టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యుపిఐ) రెండంకెల స్థాయి లోనే కొనసాగుతుంది. ప్రస్తుత ఏడాది జులైలో డబ్ల్యుపిఐ 11.12 శాతంగా నమోదయ్యింది. గతేడాది ఇదే నెలలో 12.07 శాతంగా ఉంది. దీంతో పోల్చితే స్వల్పంగా తగ్గినప్పటికీ ఇది అత్యంత ఆందోళనకర స్థాయేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గడిచిన జులైలో రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ 5.59 శాతంగా చోటు చేసుకుంది. ఇంతక్రితం జూన్లో ఇది 6.26 శాతంగా ఉంది. కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ ఆర్బిఐ లక్ష్యానికి అనుగుణంగా నియంత్రణలోకి రానుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ 4 శాతానికి అటూ, ఇటుగా 2 శాతం తేడాతో ఉండొచ్చని ఆర్బిఐ అంచనా. జిఎస్టి, ప్రత్యక్ష పన్నుల వసూళ్లు పెరుగుతున్నాయన్నారు. డిమాండ్ పుంజుకు ంటుందని, పండగ సీజన్ నేపథ్యంలో రుణ మంజురు వృద్థి మెరుగుపడుతుందన్నారు.