Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.25 పెరిగిన వంట గ్యాస్ ధర
న్యూఢిల్లీ : దేశీయ ఎల్పీజీ సిలిండర్ల ధరలను మరోసారి పెరిగాయి. సబ్సిడీయేతర సిలిండర్ ధరను రూ.25ను కేంద్రం పెంచింది. ఢిల్లీలో ఎల్పీజీ సిలిండర్ ఇప్పుడు రూ.859.5కు చేరింది. అంతకుముందు దీని ధర రూ.834.50గా ఉండేది. ఈ ఏడాది జూలై 1న సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం రూ.25.50 పెంచిన విషయం తెలిసిందే. ముంబైలో కూడా 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ.859.5కు చేరింది. కోల్‌కతాలో సిలిండర్ ధర రూ .861 నుంచి రూ. 886కు పెరిగింది. చెన్నైలో రూ. 850 నుంచి రూ.875.50కు చేరింది. ఇక హైదరాబాద్‌లో రూ.887గా ఉన్న గ్యాస్ ధరలు 25రూపాయలు పెరిగి రూ.912కి పెరిగింది. ఇప్పటికే భారీగా పెరిగిన గ్యాస్ ధరలపై మండిపడుతున్న ప్రజలకు ఇది మరింత ఆగ్రహానికి గురిచేసింది. కరోనా కాలంలో కూడా పెట్రోల్, డీజిల్‌లతో పాటు గ్యాస్ ధరలు తరచూ పెంచుతున్న మోడీ సర్కార్‌పై సామాన్యులు మండిపడుతున్నారు.