Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఘటనకు ముందు ఎంపీ అతూల్ రారుపై లైంగిక ఆరోపణలు చేస్తూ ఫేస్బుక్లో వీడియా
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమీపంలో ఇద్దరు వ్యక్తులు ఓ మహిళ, ఓ పురుషుడు నిప్పంటించుకోవడం కలకలం రేపింది. సుప్రీంకోర్టు గేట్ నెంబర్-డీ ఎదుట సోమవారం మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసు కుంది. అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు వెంటనే అప్రమత్తమై నిప్పు ఆర్పారు. బాధితులను రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ ఘటనకు ముందు వారు. ఘోసీకి చెందిన బీఎస్పీ ఎంపీ అతూల్ రారుపై లైంగికదాడి ఆరోపణలు చేస్తూ.. ఫేస్బుక్లో వీడియోను ఉంచారు. ఎంపీ అతూల్ రారు 2019లో తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని సదరు మహిళ ఆరోపించింది. అయితే, దీనిపై ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అయితే, పోలీసులు అతూల్ రారుకి అనుకూలంగా కేసును మార్చారనీ, తనను నేరస్తులుగా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. దీని కారణంగా ''న్యాయస్థానంలో నన్ను తప్పు ఆరోపణలు చేసిన వారిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. వారు నాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. చివరికి నేను, సాక్షులు బాధితులుగా మిగిలిపోయాం. రారుని రక్షించడం కోసం పోలీసులు, ఇతర అధికారులందరూ తమను నేరస్తులుగా చేసే కుట్ర చేస్తున్నారు'' అంటూ లైంగికదాడి బాధితురాలు ఆ వీడియోలో పేర్కొంది.
నిప్పంటించుకున్న ఘటనపై ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ.. గాయపడిన వారు ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌కు చెందినవారనీ, ఇందులో ఓ మహిళపై బీఎస్పీ ఎంపీ అతూల్ రారు 2019 జూన్‌లో లైంగికదాడికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. దీనిపై కేసు కూడా నమోదైంది. అయితే, బాధితురాలికి వ్యతిరేకంగా వారణాసిలో ఆమె పుట్టిన రోజుకు సంబంధించి నకిలీ పత్రాలు అంశంతో కేసు నమోదైంది. ఆమెపై చీటింగ్, ఫోర్జరీ కేసు, క్రిమినల్ కుట్ర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. దీంతో వారణాసి స్థానిక కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్నున జారీ చేసిందని తెలిపారు. కాగా, వారు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో తీవ్రంగా గాయపడ్డారనీ, మహిళకు 85 శాతం గాయాలు, పురుషుడికి 65 శాతం గాయాలు అయినట్టు వైద్యులు తెలిపారు. వారి పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. కాగా, తాము ఢిల్లీ పోలీసుల నివేదిక కోసం ఎదురుచూస్తున్నామనీ, వీడియో ఆధారంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నామని యూపీ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.