Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 60 శాతం చేతివృత్తి ఆభరణాల యూనిట్లపై ప్రభావం
- కూరగాయల విక్రేతలుగా, రిక్షాపుల్లర్లు, డ్రైవర్లుగా మారిన వలస నగల తయారీ కళాకారులు
న్యఢిల్లీ: దేశంలోని కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా మహమ్మారి సంక్షోభం అన్ని రంగాలపై ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా అకస్మాత్తు విజృంభణ అనేక మంది వలస ఆభరణాల తయారీ కళాకారులను కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఏకంగా వారి వృత్తిపరమైన గుర్తింపును సైతం మార్చివేసింది. ఎంఎస్ఎంఈ సెక్టార్‌లోని బంగారు, వెండి ఆభరణాల వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపడంతో.. ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కనిపించకపోవడంతో అనేక మంది నగల తయారీ వలస కళాకారులు దేశ ఆర్థిక రాజధాని ముంబయి సహా మహారాష్ట్రలోని అనేక నగరాలను విడిచి వారి స్వస్థలాలకు వెళ్తున్నారు. ఈ రంగంలో బెంగాల్‌కు చెందిన వారు అధికంగా అక్కడుంటున్నారు. ప్రస్తుతం వారు వారి స్వస్థలాలకు చేరారు. వారు ఇదివరకు చేసిన ఉపాధి లేకపోవడంతో జీవితాలు ముందుకు సాగించడానికి వారి వృత్తులు పూర్తిగా మారిపోయాయి. కూరగాయల విక్రేతలుగా, రిక్షా పుల్లర్లు, టోటో డ్రైవర్లుగా మారారు. అయినప్పటికీ వారి పరిస్థితులు దుర్భరంగానే ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. దేశంలో అంచనా వేయబడిన ఐదు లక్షల ఆభరణాల యూనిట్లలో 60 శాతం ఉన్న చిన్న, మధ్య తరహా ఆభరణాల యూనిట్లపై కరోనా సెకండ్ సమయంలో తీవ్ర ప్రభావం పడింది. ఇండియన్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ (ఐజీఎఫ్)-ముంబైకి చెందిన చైర్మన్ కాళిదాస్ సిన్హా రారు మాట్లాడుతూ.. ముంబయి సహా మహారాష్ట్రలోని అనేక నగరాల్లో ఉన్న దాదాపు 1.5 లక్షల మంది ఆభరణ కాళకారుల్లో దాదాపు 45 శాతం మందిని విడిచిపెట్టాల్సి వచ్చిందన్నారు. ఈ చేతివృత్తుల వారు అధికంగా హుగ్లీ, ఔరా, పుర్బా, పశ్చిమ మెడ్నిపూర్, బెంగాల్‌లోని ఇతర ప్రాంతాలకు చెందిన వారున్నారని అన్నారు. ''పరిస్థితులు మెరుగుపడతాయనే గ్యారంటీ లేదు. కోవిడ్ మొదటి దశ తర్వాత చాలా మది తిరిగి వచ్చారు. కానీ సెకండ్‌వేవ్‌తో మరింతగా పరిస్థితులు దిగజారడం.. థర్డ్‌వేవ్ భయాలు కోలుకోలేని దెబ్బకొట్టాయన్నారు''. గుజరాత్‌లోని అహ్మదాబాద్, భూజ్, ఆనంద్, నడియాడ్, బరోడా, రాజ్‌కోట్, సూరత్ వంటి ప్రాంతాల్లో ఇవే పరిస్థితులున్నాయి. దాదాపు లక్ష మంది వారి స్వస్థలాలకు వెళ్లారని అక్కడి వ్యాపార సంఘాలు పేర్కొన్నాయి. ఇక ఈశాన్య రాష్ట్రమైన అసోంలోనూ ఈ రంగలోని వారు దాదాపు 2.5 లక్షల మంది.. వేరువేరు ఉద్యోగాల్లోకి మారాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దాదాపు 1.5 లక్షల మంది వ్యవసాయం, అనుబంధ రంగాల్లోకి మారారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. కొంత మంది వారి స్వస్థలాలకు వెళ్లినప్పటికీ.. పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయని హైదరాబాద్‌కు చెందిన సంఘాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.