Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 66 నుంచి 24శాతానికి తగ్గుదల : ఇండియా టుడే సర్వే
- రెండో వేవ్‌లో ప్రజల కష్టాలకు కారణం పాలకులే
- మోడీ సర్కార్ ఆర్థిక విధానాలతో ధనికులకే లబ్ది
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ పనితీరుపై, ఆయన సర్కార్‌పై భ్రమలు తొలగిపోతున్నాయా? అంటే.. 'ఇండియా టుడే' తాజా సర్వే గణాంకాలు అవుననే చెబు తున్నాయి. తదుపరి ప్రధానిగా ఎవరు ఉండాలని కోరుకుంటున్నారనే ప్రశ్నకు 2020 ఆగస్టులో 66శాతం మంది ప్రధాని మోడీకి ఓటేయగా, 2021 జనవరిలో 38శాతం, ఆగస్టు 2021లో 24శాతానికి క్షీణించింది. గత ఏడాది ఆగస్టునాటితో పోల్చితే..ఆయన పట్ల ప్రజల అభిప్రాయంలో గణనీయ మార్పు వ్యక్తమైందని సర్వే తెలిపింది. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని సర్వేలో పాల్గొన్న 42శాతం మంది అభిప్రాయపడ్డారు. అవినీతి బాగా పెరిగిపోయిందని 76శాతం మంది, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని 32శాతం మంది తెలిపారు. గత రెండేండ్ల ఇండియా టుడే సర్వే గణాంకాలతో పోల్చిచూడగా, మోడీ ప్రభ గణనీయంగా తగ్గింది. 'మూడ్ ఆఫ్ ద నేషన్-ఆగస్టు, 2021' పేరుతో విడుదల చేసిన సర్వేలో పేర్కొన్న మరికొన్ని విషయాలు ఈవిధంగా ఉన్నాయి.
ఆర్థికం, పాలన
కరోనా సంక్షోభం వల్ల తమ ఆదాయం పడిపోయిందని 69శాతం, ఉద్యోగాలు పోయాయని 19శాతం మంది చెప్పారు. మోడీ సర్కార్ ఆర్థిక విధానాలు దేశంలో బడా వ్యాపారులకే లబ్ది చేకూర్చాయని 46శాతం మంది చెప్పారు.మోడీ సర్కార్ ఆర్థిక విధానాలు బాగున్నా యని,సంతృప్తి వ్యక్తం చేసిన వారి సంఖ్య కూడా(66 నుంచి 47శాతానికి) ఈసారి గణనీయంగా తగ్గింది.అలాగే మతసామరస్యం దెబ్బతింటోందని గత సర్వేలో 22శాతం ఆందోళన వ్యక్తం చేయగా, ఇప్పుడది 34శాతానికి పెరిగింది. ప్రజాసామ్యం ప్రమాదంలో పడిందని భావించేవారి సంఖ్య 42శాతం నుంచి 45శాతానికి పెరగగా, నిరసనలు, ఆందోళన చేపట్టకుండా పాలకులు అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని 51శాతం మంది చెప్పారు.
కోవిడ్ సంక్షోభం
రెండో వేవ్‌లో ప్రజల కష్టాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని 44శాతం మంది చెప్పారు. కోవిడ్ మరణాలపై ప్రభుత్వాలు విడుదల చేసిన సమాచారాన్ని నమ్మలేమని, మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నా...తక్కువ చేసి చూపారని 71శాతం మంది అభిప్రాయపడ్డారు.