Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీకి చెందిన ఇద్దరికి..
న్యూఢిల్లీ : తెలుగురాష్ట్రాల టీచర్లకు జాతీయ అవార్డులు లభించాయి. తెలంగాణ నుంచి ఇద్దరు,ఏపీకి చెందిన ఇద్దరికి దక్కాయి. కేంద్ర విద్యా శాఖ దేశంలోని ఉపాధ్యాయులకు ప్రతి ఏటా జాతీయ అవార్డులను ఇస్తున్నది.2021 ఏడాదికి సంబంధించి దేశవ్యాప్తంగా 44 మంది ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులు ప్రకటించింది. తెలంగాణలో కొమరం భీం అసీఫాబాద్, కేరమేరి, ఎంపిపిఎస్ తాత్కాలిక ప్రధానోపాధ్యాయుడు రంగయ్య కడ్రేలాకు, సిద్ధిపేట జిల్లా ఇంద్రా నగర్ జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామస్వామి పయ్యావులకు జాతీయ అవార్డులు లభించాయి.ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా, ఎస్ రాయవరం మండలం, లింగరాజు పాలెం జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొణతాల ఫణి భూషన్ శ్రీధర్‌కు, చిత్తూరు జిల్లా ఎం. పైపల్లి ఐరాలా జిల్లా పరిషత్ ఉపాధ్యాయుడు ఎస్.ముణి రెడ్డికి జాతీయ అవార్డులు లభించాయి.