Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొలీజియం సిఫారసులపై మీడియా కథనాల పట్ల తీవ్ర ఆవేదన
న్యూఢిల్లీ : నూతన న్యాయమూర్తుల నియామకం కోసం సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులపై మీడియా కథనాల పట్ల భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వి రమణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికారిక ప్రకటనకు ముందే నియామకాల గురించి కథనాలు రావడంవల్ల అవాంఛనీయ ఫలితాలు వస్తాయన్నారు. ఇటువంటి వార్తలను రాసేటపుడు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మీడియాను కోరారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ సిన్హా పదవీ విరమణ సందర్భంగా బుధవారం జరిగిన వీడ్కోలు సమావేశంలో జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడారు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియ అత్యంత పవిత్రమైనదనీ, దీనికి సముచిత గౌరవం ఉందని తెలిపారు. ఈ విషయాన్ని మీడియా అర్థం చేసుకోవాలన్నారు. ఇటువంటి బాధ్యతారహితమైన రిపోర్టింగ్, ఊహాగానాల వల్ల ప్రతిభావంతుల కెరీర్‌కు విఘాతం కలిగిన ఉదాహరణలు ఉన్నాయన్నారు.