Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'వాళ్లు మలయాళీ తాలిబన్లు'.. పలువురు నేతలు, అధికారుల ఆగ్రహం
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ తాజాగా చేసిన ఓ ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. తాలిబన్లతో మలయాళీ లింకు ఉన్నట్టు చెబుతూ ఓ పోస్టుకు ఆయన కామెంట్‌ను ట్వీట్ చేశారు. ఇది వైరల్‌గా మారి పలువురు నేతలు, అధికారుల ఆగ్రహానికి గురైంది. వివరాల్లోకెళ్తే.. రమీజ్ అనే వ్యక్తి తన ట్విట్టర్లో ఓ వీడియోను పోస్టు చేశాడు. ఆ వీడియోలో కాబూల్ చేరుకున్న తర్వాత తాలిబన్ ఫైటర్లు నేలపై కూలబడి ఆనందభాష్పాలు రాల్చారు. అయితే ఆ వీడియోపై ఎంపీ శశి థరూర్ రియాక్ట్ అవుతూ.. ఆ తాలిబన్లు మలయాళంలో మాట్లాడుకున్నట్టు తన ట్వీట్లో పేర్కొన్నాడు. ఈ వీడియోలోని 8వ సెకను వద్ద మలయాళీ పదాన్ని వాడినట్టు తెలిపారు. ఈ కామెంట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే రమీజ్ తన ట్వీట్లో వివరణ ఇస్తూ.. తాలిబన్లకు కేరళతో సంబంధం లేదన్నాడు. ఆ వీడియోలో ఉన్నవాళ్లు బలుచిస్థాన్కు చెందిన ద్రావిడ భాష బ్రాహ్విలో మాట్లాడుతున్నారని తెలిపాడు. ఈ భాష తెలుగు, తమిళం, మలయాళంకు సమీపంగా ఉంటుందన్నాడు.
ఈ ట్వీట్ మళ్లీ రియాక్ట్ అయిన శశిథరూర్.. రమీజ్ ఇచ్చిన వివరణ ఇంట్రెస్టింగ్గా ఉన్నా.. భాషా పండితులు ఆ పదాల అర్ధాలను తేల్చుతారనీ, గతి తప్పిన మలయాళీలు తాలిబన్లలో చేరి ఉంటారన్న అభిప్రాయాన్ని ఎంపీ శశి వ్యక్తం చేశారు. ఇక శశిథరూర్ వ్యాఖ్యల నేపథ్యంలో కేరళ వాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పలువురు నేతలు, అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. థరూర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.