Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు
- చాలా రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు : ఐఎండీ
న్యూఢిల్లీ: ఇటీవల కాస్త నెమ్మదించినప్పటికీ.. మళ్లీ దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో దేశంలోని చాలా రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నెల 19 నుంచి మూడు రోజుల పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. దక్షిణ భారతంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు పడుతుండగా.. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పాడే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మధ్య, దక్షిణ భారతదేశంలో రానున్న రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. గుజరాత్ సహా సరిహద్దు రాష్ట్రాలు, అలాగే పశ్చిమబెంగాల్, ఒడిశా, బీహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, విదర్భాల్లో వచ్చే ఐదు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.
ఈనెల 19 వరకు జార్ఖండ్లో.. బెంగాల్ నుంచి సిక్కిం వరకు ఉన్న రాష్ట్రాల్లో బుధవారం నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. అలాగే, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, విదర్భా ప్రాంతాల్లో భారీ వర్షాఆలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. మరో మూడు రోజలపాటు మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈశాన్య భారతంలో రానున్న ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.