Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గో బ్యాక్ అంటూకార్మికుల నినాదాలు
- పలాయనం చిత్తగించిన అమితాబ్ కాంత్
విశాఖ : నిటి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్‌కు ఉక్కు సెగ తగిలింది. విశాఖ మెడ్‌టెక్ పరిశ్రమలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన అమితాబ్‌కు స్టీల్‌ప్లాంట్ హిల్‌టాప్ గెస్ట్ హౌస్‌లో అధికారులు బస ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న కార్మికులు గెస్ట్‌హౌస్ వద్ద ఆందోళన చేపట్టారు. 'గో బ్యాక్ నీతి అయోగ్ సీఈఓ' అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. హిల్‌టాప్ గెస్ట్ హౌస్ ప్రాంగణం అంతా వీరి నినాదాలతో మార్మోగిపోయింది. పోరాటాలతో సాధించుకున్న ప్లాంట్ రక్షణ కోసం ప్రాణాలైనా వదులుతాం... పరాయివాళ్లకు కట్టబెట్టనివ్వం... టాటా కాదు కదా ప్రైవేట్ అన్న మాట వినపడకూడదు...'' అంటూ కార్మికులంతా ముక్తకంఠంతో ఎలుగెత్తారు. దాదాపుగా నిటి ఆయోగ్ సీఈఓ పర్యటించే రోడ్లన్నింటినీ దిగ్బంధించడంతో పోలీసులు అమితాబ్‌కాంత్‌ను చాలాసేపు విశాఖ ఎయిర్‌పోర్టులోనే ఉంచారు. ఆ తర్వాత ప్లాంట్ రోడ్డులో కాకుండా లంకెలపాలెం నుంచి మెడ్‌టెక్ జోన్‌కు తీసుకెళ్లారు. కార్యక్రమం ముగించుకొని వెళ్లేటప్పుడైనా అడ్డుకుంటామని కార్మికులు భావించినప్పటికీ పోలీస్ ఉన్నతాధికారులు అమితాబ్‌ను అప్రమత్తం చేసి కార్మికుల కంటపడకుండా దొడ్డిదారిన ఆయన్ను పంపించేశారు.
ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ వచ్చిన సందర్భంగా ఆమె పర్యటనకూ ఉక్కు సెగ తగిలిన విషయం తెలిసిందే.