Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సోమ్‌నాథ్(గుజరాత్) : విధ్వంసకర, ఉగ్రవాద శక్తులు తాత్కాలికంగా ఆధిపత్యం చెలాయించొచ్చేమో కానీ శాశ్వతంగా కాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమనాథ్ ఆలయానికి చెందిన పలు ప్రాజెక్టులను మోడీ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధ్వంసం కోసం ప్రయత్నించే శక్తులు, ఉగ్రవాదం ద్వారా సామాజ్య్రాలను సృష్టించే సిద్ధాంతాలను అనుసరించే వారి ఉనికి శాశ్వతం కాదని, వారు మానవత్వాన్ని ఎక్కువ కాలం అణచివేయలేరని స్పష్టం చేశారు. అలాంటి సిద్ధాంతాలను చూసి ప్రపంచం భయపడుతోందని, ఇటువంటి సమయంలో ఈ సోమనాథ్ దేవాలయం ప్రపంచానికి ఉత్తమమైన ఉదాహరణ అని, భరోసాగా ఉంటుందని అన్నారు. గతంలో అనేకసార్లు ఆలయాన్ని ధ్వంసం చేసి దోచుకున్నా, నేడు నూతనంగా ఆధునీకరిం చబడిందని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ను ఇటీవల తాలిబన్లు వశపరుచుకున్న నేపథ్యంలో మోడీ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సోమనాథ్ ఆలయ ట్రస్టు సభ్యుడిగా కూడా ఉన్న మోడీ దేశంలో మతపరమైన పర్యాట కాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.