Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రయల్స్‌కు దరఖాస్తు చేసుకున్న జాన్సన్ అండ్ జాన్సన్
- సెప్టెంబరులో కోవాగ్జిన్ పిల్లల వ్యాక్సిన్ ట్రయల్స్ ఫలితాలు
న్యూఢిల్లీ : భారత్‌లో పన్నెండేండ్లు పైబడ్డవారికి కరోనా వ్యాక్సిన్ అందజేసేందుకు..వ్యాక్సిన్ ట్రయల్స్‌కు జాన్సన్ అండ్ జాన్సన్ దరఖాస్తు చేసుకుంది. 12-17ఏండ్ల మధ్యవారికి కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ నిమిత్తం కేంద్ర ఔషధ నియంత్రణ ప్రమాణాల సంస్థకు జాన్సన్ అండ్ జాన్సన్ గత మంగళవారం దరఖాస్తు చేసుకుందని సమాచారం. ''అన్ని వయస్సులవారికీ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్నదే మా లక్ష్యం'' అని సంస్థ ప్రకటించింది. అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ 18ఏండ్లపైబడిన వారికోసం తయారుచేసిన సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్ భారత్‌లో అత్యవసర వినియోగ అనుమతి పొందింది. భారత్‌లో ఇప్పటివరకూ కోవిషీల్డ్, కోవాక్జిన్, స్పుత్నిక్-వి, మోడెర్నా కంపెనీల వాక్సిన్లకు అనుమతి దక్కగా, జాన్సన్ అండ్ జాన్సన్వారిది ఐదో వ్యాక్సిన్. అయితే పిల్లలు, 18ఏండ్లలోపువారికి వ్యాక్సిన్ వినియోగానికి భారత్‌లో ఇంకా అనుమతులు ఇవ్వలేదు. ఈ అంశంపై కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాందవియ్యా మాట్లాడుతూ..''పిల్లలకు కరోనా వ్యాక్సిన్ వినియోగంపై జైడస్ క్యాడిలా, భారత్ బయోటెక్ పరిశోధనలు చేశాయి. వీటి ఫలితాలు వచ్చే నెలలో రాబోతున్నాయి. పిల్లలకు కరోనా వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి వస్తుందని చెప్పగలను'' అని అన్నారు. సెప్టెంబరులోగానీ, సెప్టెంబరు చివర్లోగానీ కోవాగ్జిన్ పిల్లల వ్యాక్సిన్ ఫలితాలు రాబోతున్నాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డైరెక్టర్ ప్రియా అబ్రహం మీడియాకు తెలిపారు.
పిల్లల వ్యాక్సిన్‌పై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రంకూడా తెలిపింది. వీటి ఫలితాలు త్వరలో రానున్నాయని అందులో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వంలోని నిపుణుల బృందం అనుమతులు రాగానే వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమవుతుందని సమాచారం.