Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆ పార్టీని వీడిన ఎమ్మెల్యే
చండీగఢ్ : సాగుచట్టాలు బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తు న్నాయి. రైతులు, నిపుణులే కాకుం డా ఆ పార్టీలోని నాయకులే వీటిని వ్యతిరేకిస్తున్నారు. ఈ మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్లో బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఆ పార్టీని వీడారు. ఫిరోజ్పూర్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుఖ్పాల్ సింగ్ నన్నూ ఈ నిర్ణ యం తీసుకున్నారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో ఎందరో రైతులు మరణించారనీ, వారికి సంఘీభావంగానే పార్టీని వీడినట్టు సుఖ్పాల్ వివరించారు. 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సాగు చట్టాల విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలని తన మద్దతుదారులు చేసిన ఒత్తిడి మేరకు రాజీనామా చేస్తున్నట్టు తెలి పారు. బీజేపీని వీడటంతో ఆయన శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)లో చేరుతారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, ప్రస్తుతం తాను ఏ పార్టీలోనూ చేరడంలేదని చెప్పారు. ''నా మద్దతుదారులు, కార్యకర్తలు ఏది చెప్తే దానిని పాటిస్తాను'' అని ఆయన తెలిపారు.