Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రేమికుడు, కాబోయే భర్త అనుమానంతో ఘాతుకం
- ముగ్గురికి తీవ్ర గాయాలు
విజయనగరం : విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడువాడ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. తాను పెళ్లి చేసుకోబోయే ప్రియురాలిపై యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో యువతితోపాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం... విజయనగరం జిల్లా చౌడువాడకు చెందిన గాలి రాములమ్మ, చౌడువాడలో డ్రైవర్‌గా పని చేస్తున్న శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారువ గ్రామానికి చెందిన ఆళ్ల రాంబాబు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలూ అంగీకరించాయి. ఇటీవల ఆ యువతి వేరే యువకుడితో మాట్లాడుతుండడంతో రాంబాబు లో అనుమానం మొదలైంది. దీంతో, పెళ్లి చేసుకో బోనని చెప్పాడు. నెల రోజుల క్రితం పెద్దల, పోలీసుల సమక్షంలో రాజీ కుదరడంతో అక్టోబర్‌లో పెళ్లికి రాంబాబు అంగీకరించాడు. తాను వద్దని చెప్పినా ఆ యువకుడితో రాములమ్మ మాట్లాడుతోం దని కక్ష పెంచుకున్నాడు. గురువారం అర్ధరాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తోన్న రాములమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆమెకు సమీపంలో నిద్రిస్తున్న రాములమ్మ అక్క బాకి సంతోషి, సంతోషి కుమారుడు అరవింద్‌కు కూడా గాయాలయ్యాయి. పోలీసులు వారి ముగ్గురినీ జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ కెజిహెచ్‌కు తరలించారు.