Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 139 కోట్ల వ్యయంతో నిర్మాణం
- గుజరాత్‌లోని సిల్వాస్సాలో అత్యాధునిక కట్టడం
గాంధీనగర్ : విదేశీ అధ్యక్షులు, రాష్ట్రపతులు వచ్చినా గుజరాత్‌కు తీసుకెళ్లి చూపిస్తున్నారు ప్రధాని మోడీ. దేశంలో ఇతర మహానగరాలను కాదని.. గుజరాత్‌కు ప్రధాని అన్నట్టుగా అభివృద్ధి పనులకు పచ్చజెండా ఊపుతున్నారు. కోట్లు ఖర్చుపెట్టి నిర్మిస్తున్న ఆ కట్టడాలపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా 139 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నమో మెడికల్ కాలేజీ స్లాబ్ కుప్పకూలటంతో.. దాని నాణ్యతపైనే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే స్లాబ్ కూలగా... ఎలాంటి ప్రాణనష్టంలేకపోవటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
అంతా నమోమయం.. మరి నాణ్యత ఏదీ..?
ముందు ఒకపేరు... ఆ తర్వాత తన పేరు అన్నట్టుగా నరేంద్రమోడీ పేరుతో గుజరాత్లో నిర్మాణాలు జరిగాయి. జరుగుతున్నాయి. మోతేరా స్టేడియంకు ముందుగా సర్దార్ వల్లభభారు పటేల్ పేరు పెట్టి.. తర్వాత నమో పేరును పెట్టుకున్నారు మోడీ. ఇపుడు దనాలోనూ నిర్మిస్తున్న మెడికల్ కళాశాలకు మోడీ తన పేరే పెట్టుకున్నారు. దనా ప్రాంతంలో కడుతున్న నమో మెడికల్ కళాశాల భవనం నిర్మాణ:లో ఉండగానే కూలిపోయింది. గుజరాత్లో ఆదివాసీల భూములను స్వాధీనపర్చుకుని కట్టిన పటేల్ విగ్రహంలోనూ చిన్న వర్షం వస్తే చాలు లోపలంతా నీటితో నిండిపోతున్నది. నాణ్యతలేకుండా కడుతున్నవి ఎన్నో కట్టడాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లో చౌహాన్ సర్కార్ నిర్మించిన ఐదు భారీ వంతెనలు నీటిలో కొట్టుకుపోయాయి. తాజాగా ప్రధాని సొంత రాష్ట్రంలో.. నమో పేరుతో కడుతున్న కట్టడం ఒక్కసారిగా పడిపోయిందంటే.. నిర్మాణపనుల నాణ్యతపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్‌లో ఇక్కడ ప్రవేశాలు తీసుకునే విద్యార్థుల భద్రతపై ప్రజల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఘటనాస్థలికి దనా పరిపాలన అధికారులు, పోలీసులు ఉన్నతాధికారులు చేరుకుని పరిశీలించారు. అయితే నమో మెడికల్ కాలేజీ లోని ఓ భవనం కూలిందన్న సమాచారాన్ని బయటపడనీ యటంలేదు. నమో పేరుమీద కడుతున్న వైద్యకళాశాల ప్రమాదం జరిగిందన్న విషయం తెలియగానే గుజరాత్ నుంచి ఢిల్లీ వరకూ చర్చనీయాంశంగా మారింది.