Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యంత ప్రమాదంలో సగం మంది చిన్నారులు
- దక్షిణాసియాలో టాప్లో భారత్, పాక్, బంగ్లా, ఆఫ్ఘన్ దేశాలు : యూనిసెఫ్
న్యూఢిల్లీ: ప్రపపంచ వ్యాప్తంగా అభివృద్ధి పేరిట ప్రకృతి విధ్వసం కొనసాగుతోంది. దీని కారణంగా మానవాళితో పాటు అనేక జీవుల మనుగడ ప్రమాదకరంగా మారుతోంది. ఇప్పటికే అనేక అధ్యయనాలు వాతావరణ మార్పులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా యూనిసెఫ్ నివేదిక సైతం ఇలాంటి పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వాతావరణ మార్పుల వల్ల పిల్లల ఆరోగ్యం, విద్య, రక్షణపై తీవ్ర ప్రభావం పడుతున్నదనీ, పర్యావరణ మార్పులు చిన్నారుల జీతానికి శాపంగా మారుతున్నాయని యూనిసెఫ్ నివేదిక పేర్కొంది. పిల్లలపై పర్యావరణ మార్పు ముప్పు అధికంగా ఉన్న దక్షిణాసియా నాలుగు దేశాల్లో భారత్ కూడా ఒకటని వెల్లడించింది.
'ది క్లైమేట్ క్రైసిస్ ఈజ్ ఏ చైల్డ్ రైట్స్ క్రైసిస్: ఇంట్రడ్యూసింగ్ ది చిల్డ్రన్స్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్' (సీసీఆర్ఐ) పేరుతో పర్యావరణ మార్పుల కారణంగా పిల్లలపై పడుతున్న ప్రభావం, ఆయా ప్రాంతాల్లో చిన్నారులు జీవిస్తున్న పరిస్థితులను పేర్కొంటూ యూనిసెఫ్ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది.