Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సన్నిహిత వ్యక్తే హత్య చేసినట్టు సందేహం
విజయవాడ: విజయవాడ నగరంలో యువ ఛార్టర్డ్ అకౌంటెంట్ అనుమానాస్పదస్థితిలో శనివారం మృతి చెందింది. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... గుణదల గంగిరెద్దుల దిబ్బ ప్రాంతానికి చెందిన చెరుకూరి సింధు అదే ప్రాంతానికి చెందిన ప్రసేన్ అనే వ్యక్తితో కొన్నాళ్లగా సన్నిహితంగా ఉంటోంది. ఆ వ్యక్తి ఇంట్లోనే ఆమె ఉరేసుకుని కనిపించింది. సింధు తలపై బలమైన గాయం ఉండడంతో తమ కూతురిది ఆత్మహత్య కాదని, ప్రసేనే తమ కుమార్తెను హత్య చేశాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ప్రసేన్తో తన కుమార్తె సన్నిహితంగా ఉంటోందని, లాక్డౌన్ తర్వాత నుంచి ఆయనతో కలిసి ఉంటోందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సింధు తల్లిదండ్రులు పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని విజయవాడ ఎంపి కేశినేని నానిని వారు కోరారు. అనుమానాస్పద స్థితిలో మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారం కారణమని సమాచారం. సింధు, ప్రసేన్ల ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించలేదని తెలుస్తోంది. దీంతో వారిద్దరూ కలిసి ఉంటున్నట్లు సమాచారం.