Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్ విషయంలో కేంద్రం ప్రవర్తిస్తున్న తీరు పట్ల పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఇక్కడి ప్రజలకు ఓపిక నశిస్తే జమ్మూకాశ్మీర్లో కేంద్రం ఉండదని హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్లోని పరిస్థితులను చూసి కేంద్రం నేర్చుకోవాలని ఆమె సూచించారు. '' నేను మీకు మళ్లీ మళ్లీ చెప్తున్నాను. మా ఓపికను పరీక్షించొద్దు. దీనిని అర్థం చేసుకొని మీ తప్పును సరిచేసుకోండి '' అని దక్షిణ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో నిర్వహించిన పబ్లిక్ ర్యాలీలో ఆమె అన్నారు. అమెరికా వంటి పెద్ద దేశమూ ఆఫ్ఘనిస్తాన్ నుంచి తన బలగాలను ఉపసంహరించుకున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కేంద్రానికి ఇప్పటికీ అవకాశమూ ఉన్నదని ముఫ్తీ చెప్పారు.