Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇతర సిబ్బందికి గాయాలు
పఠాన్‌కోట్ : భారత సరిహద్దులో కఠినమైన వాతావరణ పరిస్థితులు ఆర్మీ సిబ్బందికి ప్రాణాంతకంగా మారుతున్నాయి. తాజాగా పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వద్ద గల మామూన్ మిలిటరీ స్టేషన్లో ట్రైనింగ్ సందర్భంగా ఒక ఆర్మీ అధికారి మృతి చెందారు. అలాగే మరికొందరు అధికారులు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్‌తో సహా మరికొందరు సిబ్బంది గాయాలపాలయ్యారు. వారిని మిలిటరీ హాస్పిటల్లో అడ్మిట్ చేయించినట్టు ఆర్మీ వెల్లడించింది. కాగా, ఈ ట్రైనింగ్ కార్యక్రమంలో దాదాపు 11 మంది అధికారులు, 11 మంది జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్, ఇతర ర్యాంకులకు చెందిన 120 మంది పాల్గొన్నారు. కాగా, వాతావరణం పొడిగా, వేడిగా ఉన్న సమయంలోనే 72 గంటల ట్రైనింగ్ కార్యక్రమం జరిగినట్టు కొందరు అధికారులు తెలిపినట్టు ఒక వార్త సంస్థ పేర్కొన్నది.