Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామేశ్వరం(తమిళనాడు) : భారత్ జాలర్ల బోట్లపై శ్రీలంక నేవీ సిబ్బంది రాళ్ల దాడికి పాల్పడ్డారని మత్స్యశాఖ విభాగ అధికారి ఒకరు తెలిపారు. శనివారం అర్ధరాత్రి సమయంలో కచ్చతీవు ప్రాంతంలో చేపలో వేటలో ఉండగా ఐదు నౌకల్లో వచ్చిన శ్రీలంక నేవీ సిబ్బంది రాళ్లతో దాడి చేశారని, ఈ ఘటనలో 60 బోట్లు దెబ్బతిన్నాయని, 25 బోట్లలోని వలలను కూడా ధ్వంసం చేశారని ఆ అధికారి ఆదివారం పేర్కొన్నారు. మత్స్యకారుల్లో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు.
ఈ ఘటనపై మత్స్యకారుల సం ఘం ప్రతినిధి ఎస్.ఎమిరెట్ మాట్లాడుతూ 556 బోట్లు శనివారం సముద్రంలోకి చేపల వేటకు వెళ్లాయని, వాటిలో కొన్నింటిని శ్రీలంక నేవీ సిబ్బంది లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. ఇలాంటి ఘటనలు పదే పదే చోటుచేసుకుంటుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.