Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- థర్డ్‌వేవ్ అంచనాల నేపథ్యంలో నీటి ఆయోగ్ సిఫార్సులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ త్వరలోనే రానుందనీ, అక్టోబర్ చివరి నాటికి గరిష్ట స్థాయికి చేరుతుందనే అంచనాలను ఇదివరకు అనేక దేశీయ, అంతర్జాతీయ సంస్థలు వెల్లడించాయి. దేశ వైద్య నిపుణులు సైతం కరోనా సెకండ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని పలు సూచనలు చేశారు. తాజాగా కరోనా విషయాలకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పడిన నీటి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే.పాల్ నేతృత్వంలోని నిపుణుల బృందం ప్రభుత్వానికి పలు కీలక సిఫార్సులు చేసింది. భవిష్యత్తులో కరోనా పంజా విసిరితే 100 పాజిటివ్ కేసుల్లో దాదాపు 23 మంది ఆస్పత్రుల్లో చేరే పరిస్థితులు రావచ్చుననీ, దీనికి అనుగుణంగా వైద్య మౌలిక సదుపాయాల ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఇదివరకు దేశంలో కరోనా పంజా విసరడంతో మన వైద్య సౌకర్యాల డొల్లతనం బయటపడింది. వేలాది మందికి వైద్యం అందక ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో (ఏప్రిల్-జూన్) ఈ నిపుణుల కమిటీ 20 శాతం మందికి ఆస్పత్రితో చేరే అవసరమున్నదని అంచనా వేసింది. జూన్ 1న దేశవ్యాప్త యాక్టివ్ కేసులు 18 లక్షలుగా ఉండగా, 21.74 శాతం మంది ఆస్పత్రుల్లో చేరాల్సిన పరిస్థితి అధికగ కేసులు కలిగిన 10 రాష్ట్రాల్లో ఏర్పడింది. అయితే, వాటిలో 2.2 శాతం మాత్రమే ఐసీయూ బెడ్లు ఉన్నాయి.
అప్పటి అధ్వాన్న పరిస్థితులను పేర్కొంటూ.. ఈ నిపుణుల బృందం రోజులకు 4-5లక్షల కొత్త కేసులను పరిగణలోకి తీసుకునీ, రెండు లక్షల ఐసీయూ బెడ్లు వచ్చే నెల నాటికి ఏర్పాటు చేయాలని సూచించింది. వెంటిలేటర్లతో కూడిన 1.2లక్షల ఐసీయూ పడకలు, 7 లక్షల నాన్ ఐసీయూ పడకలు సైతం ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ఇందులో 5 లక్షల పడకలు ఆక్సిజన్ ఆధారితమైనవి ఉండాలని పేర్కొంది. వీటితో పాటు మరో 10 లక్షల కోవిడ్ ఐసోలేషన్ కేర్ బెడ్లు ఏర్పాటు చేయాలని సూచించింది.