Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచంలోని చాలా దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగతు గూనే ఉంది. దీని కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టాయి. అయితే, పలు పేద దేశాలకు ఇప్పటికీ టీకాలు అందలేదు. మరికొన్ని దేశాల్లో మూడో డోసు (బూస్టర్ డోసు)పై చర్చలు నడుస్తున్నాయి. తాజాగా దీనిపై ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ గులేరియా స్పందిస్తూ.. బూస్టర్ డోస్‌పై ప్రస్తుతం దేశంలో అవసరమైన డేటా లేదని అన్నారు. వచ్చే ఏడాది సమాచారం అందుబాటులో ఉండే అవకాశముందని తెలిపారు. వ్యాక్సిన్లు అందించే రక్షణపై పూర్తి స్థాయిలో సమాచారం ఉండాలని చెప్పారు. ఇందుకుగానూ పరిశోధనలు జరపాలనీ, దీనికి మరి కొన్ని నెలలు సమయం పడుతుందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్లు తీసుకున్న వ్యక్తులు వ్యాధి నుంచి రక్షణ పొందుతున్నారని ఆయన చెప్పారు. వ్యాక్సిన్లు తీసుకున్న వారికి వైరస్ సోకితే వారు చికిత్స కోసం ఆస్పత్రుల వరకు వెళ్లే అవసరం తగ్గిపోతున్నదని వివరించారు. భవిష్యత్తులో బూస్టర్ డోస్ అవసరం ఉండవచ్చని తెలిపారు. అయితే, అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల నుంచి బూస్టర్ డోస్ మనకు అవసరమా అన్న విషయం తెలియాల్సి ఉందని అన్నారు. లేదంటే కొత్త వ్యాక్సిన్ తో బూస్టర్ డోస్ వేయాలా? అనే డేటా రావాల్సి ఉందని చెప్పారు. కాగా, పలు దేశాలు ఇప్పటికే బూస్టర్ డోసులు వేయాలని యోచిస్తోన్న విషయం తెలిసిందే. దీని వల్ల రోగ నిరోధక శక్తి మరింత పెరుగుతుందని భావిస్తున్నాయి.