Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీడియాలో నెలకొన్న పరిస్థితులపై కమిషన్ వేయాలి
- డిజిటల్, ప్రింట్, కేబుల్..అన్నీ ఒకే గొడుగుకిందకు రావాలి : జర్నలిస్టు సంఘాలు
న్యూఢిల్లీ : నేడు మీడియాలో నెలకొన్న పరిస్థితులపై ప్రత్యేక కమిషన్ వేయాలని నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్(ఎన్ఏజే), ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్(డీయూజే) సంఘాలు పలు రాజకీయ పార్టీలను, పార్లమెంట్ సభ్యుల్ని, మేధావులు, కార్మికసంఘాల్ని కోరాయి. దేశవ్యాప్తంగా పత్రికాస్వేచ్ఛ ప్రమాదంలో పడిందని ఎన్ఏజే, డీయూజే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా జర్నలిస్టు సంఘాలు 'మీడియా కమిషన్'ను ఏర్పాటుచేయాల్సిందిగా పిలుపునిచ్చాయి.ఈనేపథ్యంలో జర్నలిస్టు సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు, ఎంపీలు,ఇతర ప్రముఖులకు రాసిన లేఖను మీడియాకు విడుదల చేశాయి. అందులో పేర్కొన్న విషయాలు ఈ విధంగా ఉన్నాయి..వర్కింగ్ జర్నలిస్టు యాక్ట్-1956, వేతనాల స్థిరీకరణ చట్టం-1956 చట్టం..జర్నలిస్టులకు ఎక్కడా అమలుకావటం లేదు.ప్రింట్,బ్రాడ్కాస్ట్,డిజిటల్,కేబుల్ మీడియా..అంతా ఒకే గొడుగు కిందకు తీసుకురావాల్సిన సమయం వచ్చింది. మీడియాలో నేడు చూస్తు న్న ప్రమాదకరమైన ధోరణులు అరికట్టాలంటే అన్నింటినీ ఒకే చోటకు తీసుకురావాలి. అలాగే వేతనాలకు సంబంధించి ఒక స్థిరమైన ఫార్ములా లేదు. రివైజ్ చేసిన వేతన ఫార్ములా అమల్లోకి తేవాలి. సంస్కరణల పేరుతో కార్మిక చట్టాల్లో కేంద్రం చేపట్టిన మార్పుల వల్ల మొత్తం పాత్రికేయుల ఉద్యోగాలు అభద్రతలో కూరుకుపోయాయన్నారు.