Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కతార్ రాజధాని దోహా నుండి నాలుగు విమానాల్లో 146మంది భారతీయులను భారత్ సోమవారం తీసుకు వచ్చింది. వారిని ఆఫ్ఘనిస్తాన్ నుండి దోహాకు నాటో, అమెరికా విమానాల్లో తరలించారు. దోహా నుండి తీసుకువచ్చిన రెండో బ్యాచ్ ఇది. ఆదివారం 135మంది భారతీయులు దోహా నుండి ఢిల్లీకి చేరుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో పనిచే స్తున్న విదేశీ కంపెనీలకు చెందిన పలువురు ఉద్యోగులను కూడా భారత్ తరలించినట్లు తెలుస్తోంది. ఆదివారం వచ్చిన వారిలో ఇద్దరు ఆఫ్ఘన్ చట్ట సభల సభ్యులు కూడా వున్నారు.
కాబూల్ విమానాశ్రయంలో మంటలు
దేశాన్ని వీడి తరలి వెళ్తున్న విదేశీయులు, ఆఫ్ఘన్లతో కిటకిటలాడుతున్న కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతాన్ని పొగ కమ్మేయడంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు. నిప్పంటుకోవడానికి కారణమేమిట న్నది తెలియరాలేదు.