Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాల్పులు జరిపిన బీఎస్ఎఫ్
జమ్ము : జమ్ము సరిహద్దులో గాలిలో ఎగిరే డ్రోన్ వంటి ఒక పరికరం కలకలం రేపింది. జమ్ము జిల్లా అర్నియా సెక్టార్ పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో సోమవారం గాలిలో ఎరుగుతున్న ఒక పరికరాన్ని గుర్తించామని, అనంతరం దానిపై కాల్పులు జరిపామని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఫ్) వెల్లడించింది. ఎరుపు, పసుపు లైట్లతో వెలుగుతున్న ఈ పరికరాన్ని ఉదయం 5.30 గంటల సమయంలో తమ అర్నియా సెక్టార్ సరిహద్దులో ఉన్న తమ బలగాలు గుర్తించాయని తెలిపింది. దానిపై 25 లైట్ మెషిన్ గన్తో కాల్పులు జరపగా, కొంత ఎత్తుకు వెళ్లి అనంతరం పాకిస్తాన్ వైపునకు వెళ్లిపోయిందని పేర్కొంది.