Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 26న అన్ని పక్షాల ఫ్లోర్ లీడర్ల భేటీ :కేంద్రం
న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్తాన్లో చోటు చేసుకున్న తాజా పరిస్థితులపై చర్చించేందుకు అఖిల పక్షం సమావేశం కానున్నది. ఈ నెల 26న జరిగే పార్లమెంటరీ పార్టీ నేతల సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ వివరించనున్నారు. అలాగే అక్కడి పరిణామాల నేపథ్యంలో భారత్ అనుసరించాల్సిన వైఖరి గురించి చర్చించనున్నారు. ఆప్ఘన్ పరిణామాలపై రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లకు సంక్షిప్తంగా వివరించా లని విదేశాంగ శాఖను ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశిం చారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సోమవారం ఒక ట్వీట్లో పేర్కొన్నారు. ఇందుకు సంబం ధించిన మిగతా వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేస్తారని ఆయన తెలిపారు. కాబూల్ తాలిబన్ల గుప్పెట్లోకి వెళ్ళిన నేపథ్యంలో అక్కడి భారత పౌరులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. రాబోయే రోజుల్లో ఆప్ఘనిస్థాన్ నుంచి భారతీయులను సురక్షితంగా తరలించేందుకు సంబంధింత అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఈ నెల 17న జాతీయ భద్రతపై క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని మోడీ ఆదేశాలిచ్చారు. సురక్షితంగా అందరిని అప్ఘనిస్థాన్ నుంచి భారత్కు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. కాబూల్ విమానాశ్రయం నుంచి ఆపరేషనల్ స్టాటస్ అనేది ఈ విషయంలో ప్రధాన సవాలని తెలిపింది.