Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు హెచ్చరిక
ముంబయి : మహారాష్ట్రలోని గిరిజన ప్రాంతంలో ఇకపై పోషకాహార లోపంతో పిల్లల మరణా లు సంభవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బాంబే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. దీనికి సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జిఎస్ కులకర్ణితో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పోషకాహార లోపంతో రాష్ట్రంలోని మెల్ఘాట్ ప్రాంతంలో అధిక సంఖ్యలో చిన్నారులు, గర్భిణిలు, పాలిచ్చే తల్లుల మరణా లు సంభవించాయని పిల్ పేర్కొంది. ఈ ప్రాంతంలోని ప్రజారోగ్య కేంద్రాల్లో గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్లు, రేడియాలజిస్టులు లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. గత సంవత్సర కాలంలో ఇక్కడ పోషకాహార లోపంతో 73 మంది చిన్నారులు మరణించారని పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం తరపున కోర్టుకు హాజరైన న్యాయవాది నేహా బిడే తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ''మీ ప్రభుత్వం యంత్రాంగం సక్రమంగా ఉంటే ఇలా పోషకాహార లోపంతో 73 మంది చిన్నారులు ఎందుకు చనిపోతారు'' అని ప్రశ్నించింది. ఇది చాలా తీవ్రమైన అంశమనీ, 2020 ఏప్రిల్ నుంచి 2021 జులై వరకు రాష్ట్రంలోని గిరిజన ప్రాంతంలో పోషకాహార లోపంతో ఎంత మంది చిన్నారులు మరణించారో వివరాలు సమర్పించాలని, ఆ ఏరియాల్లోని ఆరోగ్య కేంద్రాలకు పంపిన డాకర్ల వివరాలు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.