Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ సీఎం విజయన్
తిరువనంతపురం : ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యను పరిష్క రించడానికీ, ప్రపంచానికి శాంతిని, మంచిని అందించడానికి 'మతతత్వం, రాజకీయ, పెట్టుబడిదారీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఐకమత్యంగా' నిలవాల్సిన సమయం ఇదేనని కేరళ సీఎం పినరయి విజయన్ వివరించారు. విద్వేషాన్ని రెచ్చగొట్టే చర్యలను ప్రతిఘటించాలని తెలిపారు. ఆధ్యాత్మిక నాయకుడు, సంఘ సంస్కర్త శ్రీనారాయణగురు 167వజయంతి సందర్భంగా తన ఫేస్బుక్ పోస్టులో ఆయనపై విధంగాపేర్కొన్నారు. కులం,మతంపై మానవత్వాన్ని ప్రకటించే శ్రీనారాయణ గురు సందేశాలను సమాజం లోని అభ్యున్నతి కోసం మును పెన్నడూ లేనంతగా ప్రస్తుత సమయాల్లో అర్థం చేసుకోవాలనీ, వాటిని నిజాయితీగా అనుసరించాలని విజయన్ అన్నారు. కాగా, శ్రీనారాయణ గురుజయంతి సందర్భంగా కేరళగవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ఖాన్ తనవినయ పూర్వక ప్రణామాలు తెలిపారు.