Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వింటాకు రూ.50 పెంపు..
- పంజాబ్ ముఖ్యమంత్రితో రైతు సంఘాల నేతలు చర్చలు
భటిండా: పంజాబ్ రైతుల ఉద్యమం విజయవంత మైంది. రైతుల డిమాండ్లకు పంజాబ్ ప్రభుత్వం అంగీకరిం చింది. చెరకు ధర పెంచాలని కోరుతూ పంజాబ్లోని జలంధర్ వద్ద జాతీయ రహదారి, రైల్వే లైన్ల దిగ్బంధించిన రైతులు ఐదు రోజులుగా నిరవధికంగా ఆందోళన కొనసాగించారు. 32 రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళన విజయవంతమైంది. రైతు ఆందోళనకు ప్రభుత్వం దిగొచ్చింది. రైతుల డిమాండ్లను నెరవేర్చేం దుకు సుముఖతం వ్యక్తం చేసింది. మంగళవారం పంజాబ్ ప్రభుత్వం, రైతు సంఘాల నేతల మధ్య మూడో విడత చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పాల్గొన్నారు. క్వింటాకు రూ.50 పెంపుకు అంగీకరించారు. దీంతో క్వింటా చెరకు ధర రూ.360కి పెరుగుతుంది. రైతుల సమిష్టి పోరాటానికి చారిత్రక విజయంమని రైతు సంఘాలు పేర్కొన్నాయి. ఈ సందర్భాంగా తమ ఉద్యమానికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపాయి.