Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఇటీవలే ఆఫ్ఘానిస్థాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు ఆ దేశంలో అరాచక పాలనను కొనసాగిస్తున్నారు. యావత్ ప్రపంచం అక్కడి పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటివరకు తాలిబన్లతో పోరాటం సాగించిన ఆమెరికా నాటో దళాల అత్యాధునిక ఆయుధాలు ఇప్పుడు ముష్కరుల చేతికి చిక్కాయి. ఆ ఆయుధాలతో భారత్‌కు ముప్పేనని భారత సీనియర్ ఆర్మీ ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆ ఆయుధాలతో మొదట పాకిస్థాన్‌లో భయానక పరిస్థితులు సృష్టించే అవకాశాలు ఉన్నాయయన్నారు. ఆ తర్వాత ఆ ఆయుధాలను భారత్‌కు తీసుకువచ్చే ప్రమాదం పొంచివుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం తాలిబన్ల స్వాధీనం చేసుకున్న అమెరికా అత్యాధునిక ఆయుధాలతో పాటు.. ఇప్పటికే పాకిస్థాన్‌కు అందిన ఆయుధాలు ఉగ్రవాదులో చేతుల్లోకి వెళ్తున్న అంశాలను ఆ కథనాలు పేర్కొన్నాయి. ఐఎస్ఐ మద్దతిస్తున్న ఉగ్రవాద గ్రూపులు తాలిబన్ల విజయం తర్వాత బలపడ్డాయి. దీనికి తోడు ఉగ్రవాద సంస్థలకు అక్రమ మార్గాల ద్వారా అమెరికాతో పాటు పలు దేశాల నుంచి ఆయుధాలు అందుతున్నాయి. దీని కారణంగా రాబోయే రోజుల్లో ఉగ్రవా దులు పాక్‌లో హింసకు పాల్పడవచ్చు.ప్రస్తుతం తాలిబన్ల దగ్గర అమెరి కాకు చెందిన అత్యాధునిక ఆయుధాల్లో.. ఐదు లక్షల వరకూ ఎం-16,చ ఎం-14 అసాల్ట్ రైఫిల్స్, అమెరికన్ లైట్ మెషీన్ గన్స్, 50 కాలిబర్ ఆయుధాలు, స్నైపర్ రైఫిల్స్, బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు కూడా తాలిబన్ల చేతుల్లో పడ్డాయి. అలాగే, 2 వేల వరకూ సాయుధ వాహనాలు,హమ్వీలు, యూహెచ్-60 బ్లాక్ హాక్స్ సహా 40 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, అటాక్ హెలికాప్టర్లు, స్కాన్ఈగిల్ స్మాల్ డ్రోన్లు సైతం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లినట్టు సమాచారం.
ఆఫ్ఘన్‌కు ఇరాన్ ఎగుమతుల పునరుద్ధరణ
ఆఫ్ఘన్ కొత్త ప్రభుత్వం చేసిన అభ్యర్ధన మేరకు కొద్ది రోజుల క్రితమే ఆఫ్ఘనిస్తాన్‌కు ఇంధన ఎగుమతులను ఇరాన్ పునరుద్ధరించిందని ఇరాన్ అధికారి తెలిపారు. ఆఫ్ఘన్లు వందల సంఖ్యలో నగరాల నుండి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అక్కడ గ్యాసోలిన్ ధర టన్నుకు 900డాలర్లుకు చేరింది. ఈ ధరలకు చెక్ చెప్పేందుకు గానూ వర్తకులకు సరిహద్దులు తెరిచి వుంచాల్సిందిగా తాలిబన్ ప్రభుత్వం ఇరాన్‌ను కోరింది. ''మీరు పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులను కొనసాగించవచ్చు'' అని ఇరాన్‌కు సందేశం పంపినట్లు ఇరాన్ చమురు, గ్యాస్, పెట్రో కెమికల్ ఉత్పత్తుల సమాఖ్య ప్రతినిధి, బోర్డు సభ్యుడు హమిద్ హొస్సెని తెలిపారు. ఇరాన్ వ్యాపారస్తులకు, చాంబర్ ఆఫ్ కామర్స్‌కు కూడా తాలిబన్ సందేశాలు పంపింది. దాంతో, ఇరాన్ కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ఘనిస్తాన్‌కు ఇంధన ఎగుమతులపై గల నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ నెల 6నుండి ఈ నిషేధం అమల్లో వుంది. తమకు గల ఆందోళనలన్నీ తాలిబన్ వైఖరితో తుడిచిపెట్టుకుపోయాయని హమిద్ వ్యాఖ్యానించారు.
మహిళల పట్ల తాలిబన్ల వ్యవహార శైలే గీటురాయి : ఐక్యరాజ్య సమితి
తాలిబన్లు తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయమైన వార్తలు వస్తున్నాయని, అయితే మహిళల పట్ల వారి వ్యవహార శైలే ప్రాథమిక లక్ష్మణ రేఖ అవుతుందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థకి చెందిన ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మహిళలు, జర్నలిస్టులు, గత కొన్నేళ్ళలో ఆవిర్భవించిన నాగరిక సమాజ కొత్త తరం నేతలకు చాలా తీవ్రమైన భయాందోళనలు వున్నాయని మిచెల్లె బాచ్లెట్ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్పై జరిగిన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ప్రత్యేక సమావేశంలో ఆమె ప్రసంగించారు. ఇదిలా వుండగా, గత 24గంటల్లో ఆఫ్ఘనిస్తాన్ నుండి 16వేలమందిని తరలించినట్లు పెంటగన్ వర్గాలు తెలిపాయి. తాలిబన్లు పెట్టిన గడువులోగా వేలాదిమందిని అక్కడ నుండి తరలించేందుకు అమెరికా బలగాలు తమ చర్యలను ముమ్మరం చేశాయి.