Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో డిమాండ్
న్యూఢిల్లీ : భారతదేశ అమ్మకాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందనీ, ఇది ప్రజల సంపదను మొత్తంగా దోచుకోవడం తప్ప మరొకటి కాదని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో విమర్శించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ) కార్యక్రమం మొత్తం లూటీ చేయడానికి ఉద్దేశించబడిందని ఆరోపించింది. మన జాతీయ ఆస్తులను, మౌలిక సదుపాయాలను లూటీ చేసే తీరును అందులో ఆర్థిక మంత్రి వివరించారని తెలిపింది. రోజువారీ ఖర్చుల కోసం కుటుంబ వెండి, బంగారాలను విక్రయించడం ఆర్థికపరమైన తెలివితేటలు కాదు, ఇంగిత జ్ఞానం కూడా లేనిదని అర్ధమవుతుంది. అలాగే మార్కెట్లు కింది స్థాయిలో వున్నపుడు ఆస్తులు విక్రయించడం వల్ల కేవలం ఆశ్రిత పెట్టుబడిదారులకు మాత్రమే లబ్ది చేకూరుతుందనీ, ఆశ్రిత పెట్టుబడిదారీవాదం (క్రోనీ కేపిటలిజం) పెరుగుతుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలను నిరసించాలని, మన జాతీయ ఆస్తులను కొల్లగొట్టడాన్ని ప్రతిఘటించాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ప్రజలకు విజ్ఞప్తి చేసింది.