Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ మానటైజేషన్ పైప్‌లైన్‌తో మోడీ సర్కార్ తనకు మిత్రులైన కొద్దిమంది వ్యాపార వేత్తలకు లాభం చేకూర్చాలనుకుంటున్నదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. గత 70 ఏండ్లలో దేశంలో ఏమీ జరగలేదంటూనే ఆ సమయంలో సృష్టించిన ఆస్తులను బీజేపీ ప్రభుత్వం అమ్మేస్తోందని విమర్శించారు. మంగళవారం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరంతో కలిసి మాట్లాడారు. కీలక రంగాల్లో గుత్తాధిపత్యం, ఉద్యోగాలను నాశనం చేయడమే లక్ష్యంగా మోడీ సర్కార్ ప్రయివేటీకరణ ప్రణాళిక ఉన్నదని విమర్శించారు.